చంద్రఘోష్ స‌మ‌క్షంలో లోక్‌పాల్ స‌భ్యుల ప్రమాణం

lokpal
lokpal


న్యూఢిల్లీ : భారతదేశపు మొట్టమొదటి లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఈ నెల 23న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ లోక్‌పాల్‌ సభ్యులైన 8 మందితో పినాకి చంద్రఘోష్‌ ప్రమాణస్వీకారం చేయించారు.
వివిధ హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బీ భోస్లే, జస్టిస్ ప్రదీప్‌కుమార్ మహంతి, జస్టిస్ అభిలాష కుమారి, జస్టిస్ అజయ్‌కుమార్ త్రిపాఠిని జ్యుడీషియల్ మెంబర్స్‌గా, సశస్త్ర సీమాబల్ మాజీ చీఫ్ అర్చన రామసుందరం, మహారాష్ట్ర మాజీ సీఎస్ దినేశ్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్‌ఎస్
అధికారి మహేందర్‌సింగ్, మాజీ ఐఏస్ ఇంద్రజీత్ ప్రసాద్ గౌతమ్‌ను నాన్ జ్యుడీషియల్
మెంబర్స్‌గా ఎంపికచేశారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ చైర్మన్, సభ్యులు ఐదేండ్ల పాటు లేదా 70 ఏండ్ల వయసు వచ్చేవరకు పదవిలో కొనసాగుతారు.

వార్త ఈ పేప‌ర్ కోసం క్లిక్ చేయండిః https://epaper.vaartha.com/