ఏపీలో కరోనా విజృంభణ: స్కూల్స్ కు సెలవులు పొడిగించాలి

సీఎం వైఎస్ జగన్ కు లోకేష్ లేఖ

Lokesh's letter to CM YS Jagan
Lokesh’s letter to CM YS Jagan

Amaravati: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉదృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని పేర్కొన్నారు. .15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదాని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు,టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/