ఉండవల్లి గ్రామంలో లోకేష్ పర్యటన

గుంటూరు జిల్లా: తాడేపల్లి, ఉండవల్లి గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త శ్రీనివాస్‌ను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. లోకేష్ వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/