రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది..లోకేశ్‌

ఈ 18 నెలల్లో జగన్ సాధించింది శూన్యమని వ్యాఖ్యలు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: సిఎం జగన్‌పై టిడిపి నేత నారా లోకేష్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన చూసి కంపెనీలన్నీ పరార్ అంటూ వ్యాఖ్యానించారు. గత 18 నెలల కాలంలో కూల్చివేతలు, కక్ష సాధింపులు, జే ట్యాక్స్ తప్ప జగన్ సాధించింది శూన్యమని విమర్శించారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడం చేతగాని జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు కష్టాన్ని కొట్టేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘కంపెనీల పేర్ల పక్కన జగన్ రెడ్డి ఫొటోలు ఎంతపెద్దగా వేసినా, అందులో కనిపించేది రాష్ట్రానికి కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబు కష్టమే. ఈ విషయం గన్నేరుపప్పుకు ఎప్పుడు అర్థమవుతుందో’ అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/