ఆ రెండు నియోజకవర్గాల ఫై లోకేష్ ఫోకస్

lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..మునుపటిలా కాకుండా పూర్తిగా మారిపోయాడు. ముఖ్యంగా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ వైస్సార్సీపీ ప్రభుత్వ తప్పులను , ఆగడాలను బయటపెడుతూ వస్తున్నారు. అంతే కాదు తమ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. విమర్శలు , ప్రతివిమర్శలు , కౌంటర్లు ఇలా అన్నింట్లోనూ లోకేష్ మెరుగుపడ్డాడు. ఎక్కడ తగ్గేదెలా అన్నట్లు దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల ఫై పూర్తిగా ఫోకస్ పెట్టారు. సీనియర్లతో పాటు ఈసారి యువత కూడా పెద్ద ఎత్తున అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రణాళికలు చేస్తున్నారు.

ఇక గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల ఫై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో అసలు టీడీపీకి అభ్యర్ధులే లేరంటూ వైస్సార్సీపీ ప్రచారం చేస్తున్న వేళ..ఊహించని విధంగా కొత్త అభ్యర్ధులను తెర మీదకు తెచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు లోకేష్. పార్టీ నేతలను ఆ రెండు నియోజకవర్గాల్లో ముందు నుంచే మొహరించి.. పూర్తిగా పోలింగ్ బూత్ నుంచి ప్రజల్లో మమేకం అయ్యేలా కార్యచరణ సిద్దం చేస్తున్నారు. గన్నవరంలో వంశీకి వ్యతిరేకంగా వైస్సార్సీపీ లో ఉన్న నేతలు సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి సహకరించమని చెబుతున్నారు. వీటన్నింటినీ తమకు అనకూలంగా మలచుకొనేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. అయితే, కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరగాల్సిన పార్టీ మినీ మహానాడు వాయిదా వెనుక వ్యూహం ఉందని తెలుస్తోంది. కొత్త వ్యూహాలతో ముందుకు గుడివాడ నుంచి నందమూరి కుటుంబానికి చెందిన వారనే పోటీలోకి దించే అంశం పైన పార్టీలో చర్చ వినిపిస్తోంది. అయితే, పొత్తుల అంశం పైన క్లారిటీ రాకుండా ఎక్కడా అధికారికంగా అభ్యర్దులను ప్రకటించకూడదనేది పార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది. మొత్తంగా మాత్రం లోకేష్ పక్క ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది.