ఓటేసిన వారినే కాటేస్తున్నారు వైఎస్ జగన్
మద్యపాన నిషేధం పేరుతో ప్రభుత్వం దోచుకుంటుంది

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ ఏపి ప్రభుత్వంపై మండిడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా కందూరు గ్రామంలో ఓం ప్రకాశ్ అనే యువకుడు చనిపోయాడని ఆయన ఆరోపించారు. ఆయన మృతిపై విచారణ చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ‘ఓటేసిన వారినే కాటేస్తున్నారు వైఎస్ జగన్. మద్యపాన నిషేధం పేరుతో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాశ్‌ని బలితీసుకున్నారు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
‘చంపేస్తాం అంటూ వైఎస్‌ఆర్‌సిపి నాయకులు, బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రకాశ్ అనే యువకుడు చనిపోయాడు. ఓం ప్రకాశ్ మృతి పై విచారణ చేపట్టాలి’ అని లోకేశ్ చెప్పారు. ఈ మేరకు లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/