పదుల సంఖ్యలో ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు

అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపిలో కరోనా వ్యాప్తి పెరిగిపోతుంటే కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా మద్యం షాపుల వద్ద జనం బారులు తీరి నిలబడుతున్నారని ఆయన మండిపడ్డారు. డబ్బుకి ఆశపడి జగన్‌ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ‘వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా కోరలు చాచింది. ఒక పక్క కరోనా బారిన పడి వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రతి రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా జగన్ రెడ్డి గారి ధన దాహం తీరడం లేదు’ అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో 25 వేల కోట్ల రూపాయల జే ట్యాక్స్ కోసం ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నారు. కరోనా వ్యాప్తికి నిలయాలుగా మారుతున్న జగన్ మద్యం దుకాణాలు తక్షణం మూసివేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/