గుంటూరు జిల్లాలో మహిళా అత్యాచారం హత్య ఫై లోకేష్ ఆగ్రహం

ఏపీలో రోజు రోజుకు ఆడవారిపై అత్యాచారాలు , హత్య లు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. మొన్నటికి మొన్న విజయవాడ ఘటన మరచిపోకముందే..తాజాగా గుంటూరు జిల్లాలో మహిళా ఫై అత్యాచారం చేసి చంపేశారు. దీనిపట్ల తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ మరోసారి ప్రభుత్వం ఫై విమర్శలు చేసారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతుందని అన్నారు.

రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇస్తుందని,బాధితుల పక్షానే కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలని సూచించారు.అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు.వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవమృగాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే వారికి భయం పుట్టేది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.