నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది – లోకేష్ ట్వీట్

lokesh-slams-ysrcp

నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ.. మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. అంతే కాదు అయ్యనపాత్రుడు పై నిర్భయ కేసుతో సహా 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో అయ్యనపాత్రుడు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేయోచ్చనే వార్తలు బయటకు రావడం తో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడిందని జగన్‌ సర్కార్‌కు చురకలు అంటించారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా ఆడుతున్నారన్నారు. దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరకు జగన్ జడుసుకున్నారని.. జగన్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందన్నారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని వెల్లడించారు.