పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు : నారా లోకేశ్

పదో తరగతి ఫలితాలను కూడా రాజకీయం చేసేశారు..లోకేశ్

nara lokesh

అమరావతి : ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తుతో వైస్సార్సీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని, తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ఫలితాలను కూడా రాజకీయం చేశారంటూ విమర్శించారు.

మంత్రికి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఫలితాల తేదీని ప్రకటించారన్న కారణంగా ఫలితాలను అకస్మాత్తుగా వాయిదా వేస్తారా? అని నిలదీశారు. ఫలితాలను వాయిదా వేసింది మంత్రి అలిగారనా? లేదా ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల మార్పుల కోసమా? అని ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచక పాలనను చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/