మంగళగిరి నుంచి లోకేష్‌ పోటీ

nara lokesh
nara lokesh


అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వారి వారి అభ్యర్ధులను ఎక్కడ నుంచి ఎవరిని నిలబెట్టాలా అనే తర్జనభర్జనలో మునిగిఉన్నారు. ఏపిలో టిడిపి ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేసినప్పటికి పెండింగ్‌ స్థానాలపై సియం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ సారి మంత్రి లోకేష్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన ఎక్కడినుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్‌ బరిలోకి దిగనున్నారని పార్టీ అధినేత ప్రకటించారు. తొలుత భీమిలి, విశాఖ నార్త్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్‌ పోటీ చేస్తారని ప్రకటించారు.

తాజా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః http://lokesh contest from mangalagirihttps://www.vaartha.com/andhra-pradesh/