గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు

అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత లోకేశ్‌ వైఎస్‌ఆర్‌సిపిపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి నేత బాలినేని స్టిక్కర్‌తో ఉన్న కారులో డబ్బు పట్టుబడటాన్ని ప్రస్తావిస్తూ.. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటున్న జగన్ జగన్‌ ప్రభుత్వానికి, ఇక్కడి నుంచి పోతున్న డబ్బులను మాత్రం పట్టుకునే దమ్ము లేకపోయిందని ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. ‘వైఎస్ జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది’ అని అన్నారు. ఆ తరువాత ‘ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?’ అని ప్రశ్నించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/