అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసింది

9 నెలల కాలంలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు  ..ఉత్తరాంధ్ర యువత ఉపాధి అవకాశాలను వైఎస్‌ఆర్‌సిపి నేతలు దెబ్బతిస్తున్నారు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్ గారు ఉత్తరాంధ్ర ద్రోహి అని స్వయంగా ఐటీ శాఖ మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల అదానీ కంపెనీ ఏపీ నుండి వెళ్లిపోయింది. 9 నెలల కాలంలో ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేని వాళ్లు.. అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోతోంది అనడం వారి చేతగానితనాన్ని బయటపెట్టుకోవడమే’ అని తెలిపారు.’రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసింది. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతిస్తున్నారు’ అని విమర్శించారు. ‘ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో, యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించండి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/