సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ నేతల ర్యాలీ
కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యంపై ఆందోళన

అమరావతి: ఏపీ ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ నేత నారా లోకేశ్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన తెలిపారు. అమరావతిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారని వారు ఆరోపించారు. కోడికత్తి ఘటన నకిలీదని, సారా మరణాలు నిజమని ప్లకార్డులు ప్రదర్శించారు.
అలాగే, బాబాయి గుండెపోటు ఫేక్ అని, కల్తీ మద్యం నిజం అని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని అన్నారు. ఏపీలో జే బ్రాండ్ మద్యంతో పాటు కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ పెరిగిపోయాయని చెప్పారు. ఇటీవల చనిపోయిన కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/