గెలుపు టిడిపిదే


420 పార్టీతో కెసిఆర్‌ జతకట్టి ఎపిలో రాజకీయం చేయడమా!
కెటిఆర్‌ జోస్యాలు, కుట్రలు ఫలించవు: లోకేష్‌

LOKESH--
LOKESH–

అమరావతిµ : టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు చేసిన వ్యాఖ్యలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రమంత్రి నారా లోకేష్‌ శనివారం ధీటుగా సమాధానం చెప్పారు. ఆయన తండ్రి కెసిఆర్‌,నరేంద్రమోడీ,వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలకు వత్తాసు పలుకుతున్న వారికి భంగపాటు తధ్యమని లోకేష్‌ ఆవేశభరితంగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. తమపార్టీ ఏనాడు కూడా రాష్ట్ర,దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుందే తప్ప, అవకాశవాద రాజకీయాలకు పాల్పడదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఏనాడు కూడా బిజేపిపై విమర్శిస్తారే కాని మోదీపై విమర్శించరని ఢిల్లీమోడీ,తెలంగాణా కేసీఆర్‌ మోడీ,ఆంధ్రప్రదేశ్‌ జగన్‌మోడీలు ఏకమైనా త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మరోమారు అధికారంలోనికి వచ్చేది ఎవరూ ఆపలేరని ఫెడరల్‌ఫ్రంట్‌ అంటున్న కెటిఆర్‌ 420పార్టీయైన జగన్మోహన్‌రెడ్డితో జతకట్టి ఎపిలో రాజకీయం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీతరుపున జగన్‌ అభ్యర్థులను నిలపకపోవడం కేసీఆర్‌ కనుసన్నల్లో తెలంగాణాలో వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌,కేటిఆర్‌ బలప్రయోగాలు పనిచేయవని లోకేష్‌ స్పష్టంచేశారు.ఒక్క నాయకుడ్ని ఎదుర్కొలేక ముగ్గురునాయకులు కుట్రలుచేసినా ఏపి ప్రజ లంతా తమ వెంట ఉన్నారని ఆముగ్గురుకలసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన అభివృద్ధి,సంక్షేమానికే ఏపి ప్రజలు ఓటువేస్తారని లోకేష్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ళూ పూర్తియినా వైఎస్సార్సీ నేత వైఎస్‌జగన్మోహనరెడ్డి లోటాస్‌పాండ్‌కే పరిమితమై కేసీఆర్‌ నరేంద్రమోదీ సలహామేరకు హైదరాబాదులోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలను నడిపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో వైసీపీ,కెసీఆర్‌ కుట్రలుపన్నుతున్నారని శనివారం కేటిఆర్‌ మాటల్లో తేలిపోయిందని కెటీఆర్‌కు ఏపి రాజకీయాల గురించి ఏమి తెలుసని నూటికి నూరుపాళ్ళు ఏపిలో తిరిగి తెలుగుదేశంపార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోనికి వస్తుందని లోకేష్‌ స్పష్టంచేశారు.రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో నున్న అభివృద్ధి ఏపికి వచ్చిన కేంద్ర అవార్డులు కేసీఆర్‌ జీర్ణించుకోలేక పోయారని లోకేష్‌ ఆరోపించారు.తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన రెండునెలల వరకు మంత్రి వర్గం విస్తరణ చేసుకోలేని కేసిఆర్‌,కేటిఆర్‌లు కూడా తమను విమర్శించడమా.తండ్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కేసీఆర్‌ పనిచేసి నేడు కేసీఆర్‌,కేటిఆర్‌లు మాట్లాడ్డాంపై దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లోకేష్‌ కేటిఆర్‌పై విరుచుకుపడ్డారు.మోదీ కేసీఆర్‌ జగన్లు ఏకమై తెలుగుదేశం ఓటమి కోసం ప్రణాళికలు రూపొందించినా వ్యూహాలు రచించినా భంగపాటు కాకతప్పదని లోకేష్‌ తీవ్రంగా హెచ్చరించారు.2014లో తమపార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటిని అమలు చేశామని కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా ఓట్లకోసం ప్రకటించిన ప్రకటనలు తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని జాతీయస్థాయిలో ఎన్డీయే ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేసీఆర్‌ ఏపిని వ్యతిరేకించారని 26బిసీ కులాలను తొలగించి బిసీలపై సవతితల్లి ప్రేమ కురిపిస్తూ టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారక రామారావు ఏపిపై చేసిన వ్యాఖ్యలు గురివింజ సామెతలా ఉందని ఆ తెలంగాణా రాష్ట్రాన్ని చక్కదిద్దుకోలేనివారు ఏపి రాజకీయాల్లో తలదూర్చడం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదని నరేంద్రమోదీకి, కేసీఆర్‌కు,జగన్‌కు సత్తాఉంటే రానున్న ఎన్నికల్లో సత్తా నిరూపించుకోవాలని లోకేష్‌ సవాల్‌ విసిరారు.