లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకృష్ణ బిర్లా

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం
Lok Sabha Speaker Om Birla’s father passes away

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. నేడు కిషోరాపూర్‌లోని ముక్తిధామ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకృష్ణ బిర్లా మృతిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/