బెంగాల్‌లో ఉ్ర‌దిక్త‌త‌, మంత్రి కారుపై దాడి

attack on minister's car
babul supriyo, union minister

కోల్‌కతా: సార్వ్రత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ సోమవారం కొనసాగుతోంది. ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్దే తృణమూల్‌ , బిజెపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. మరోవైపు ఆసన్‌సోల్‌ ప్రాంతంలో కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో కారుపై కొందరు దాడి చేశారు.

ఈ దశలో పశ్చిమబెంగాల్‌లోని 8 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద తృణమూల్‌ కార్యకర్తలు భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కేంద్రబలగాలు లేకుండానే పోలింగ్‌ నిర్వహించడాన్ని తృణమూల్‌ కార్యకర్తలు తప్పుబట్టారు. అనంతరం బిజెపి కార్యకర్తలు కూడా ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ జరిపారు.

తాజా జాతీయ ఎన్నిక‌ల వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/