ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

ప్ర‌శ్నోత్త‌రాల‌ను అడ్డుకున్న విప‌క్షాలు

న్యూఢిల్లీ: నేడు పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు య‌ధావిధిగా ప్రారంభం అయ్యాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీలు.. భౌతిక దూరం పాటిస్తూ కూర్చున్నారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ కార్య‌క్ర‌మాలు వేర్వురుగా సాగుతున్నాయి. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడారు. హౌజ్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రిపై కెమెరాను ఫోక‌స్ చేయాల‌న్నారు. ప్ర‌తిప‌క్షాల గొంతును నొక్కొద్ద‌న్నారు. అస‌లు మీరు దేశానికి ఏం చూపించాల‌నుకున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు నిన‌దించాయి. ఆ స‌మ‌యంలో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు చేస్తున్న స‌మ‌యంలోనే.. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ కొన‌సాగించారు. ప్ర‌తిప‌క్షాల అరుపులు, కేక‌ల మ‌ధ్య ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగాయి. ఆహార ఉత్ప‌త్తుల నిల్వ‌ల గురించి ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తారు. ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు నినాదాల‌తో హోరెత్తించారు. అయితే నినాదాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో స‌భ‌ను 12 గంట‌లకు వాయిదా వేశారు. దీంతో

కాగా, రాజ్య‌స‌భ‌లోనూ విప‌క్ష స‌భ్యులు కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ చేపట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. దీంతో రాజ్య‌స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/