లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమం

Loco pilot Chandrasekhar
Loco pilot Chandrasekhar

హైదరాబాద్‌: కాచిగూడ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ పరిస్థితి విషమంగా ఉందని కేర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌, ఏఆర్‌టీ బృందాలు తీవ్రంగా శ్రమించి ఎంఎంటిఎస్‌ రైలులో ఇరుక్కుపోయిన లోకో పైలట్‌ను బయటికి తీశారు. 8 గంటల నిరంతర కృషి తరువాత అతడిని క్షేమంగా బయటకు తీయగలిగారు. వెంటనే అంబులెన్స్‌లో అతడిని నాంపల్లి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా కేర్‌ బృందం అతడిని 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచామని, చంద్రశేఖర్‌ రెండు కాళ్లకు రక్తప్రసరణ తగ్గిందని, అతని కిడ్నీకి గాయాలయ్యాయని తెలిపారు. వెంటిలేటర్‌పై ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/