లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాలి

ప్రధానిని కోరిన ఏపి సిఎం

jaganmohan reddy
jaganmohan reddy

అమరావతి: ఏపిలో లాక్‌డౌన్‌ రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ఈ రోజు ఉదయం లాక్‌డౌన్‌ అంశంపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్‌జోన్‌లు ఉన్న ప్రాంతాలలోనే లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు. ఏపిలో ఉన్న 676 మండలాల్లో 81 మండలాలు కరోనా బారిన పడ్డాయని, అందులో 37 రెడ్‌జోన్‌లుగా, 44 ఆరెంజ్‌ జోన్‌లుగా ఉన్నట్లు మిగిలినవి కరోనా బారిన పడకుండా గ్రీన్‌ జోన్‌లో ఉన్నాయని పేర్కోన్నారు. కరోనా ప్రభావం ఉన్న 81 మండలాల్లో లాక్‌డౌన్‌ విధించాలని సిఎం జగన్‌ ప్రధానిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాలని, అర్బన్‌ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగించాలని తెలిపారు. ప్రధానిగా మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉంటామని జగన్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/