మలేసియాలో రేపటి నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్

సమావేశాలు, ప్రయాణాలు, నిషేధం

Lockdown nationwide in Malaysia
Lockdown nationwide in Malaysia

Kuala Lumpur: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుదలతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ఈ నెల 12 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ దేశ ప్రధాని ముహ్యుద్దీన్‌ యాసిన్‌ వెల్లడించారు. మలేషియా కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొంటోందని, ఇది జాతీయ సంక్షోభాన్ని రేకేత్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమావేశాలతో పాటు ప్రయాణాలన్నీ నిషేధిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థలు మూసివేబడుతాయని.. అయితే, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/