తెలంగాణలో లాక్ డౌన్ అమలు

ఉదయం 6 నుంచి 10 వరకే అన్ని రకాల కొనుగోళ్లు- ఆలయాల్లో దర్శనాలు రద్దు

Sanghi Temple Hyderabad
Sanghi Temple Hyderabad

Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ అమలు లోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలను మూతపడ్డాయి. ఈ నెల 21 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. అత్యవసర సేవలను అనుమతించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని రకాల కొనుగోళ్ళు అందుబాటులో ఉంటాయి. దీంతో బుధవారం ఉదయం 10 గంటల వరకు అన్ని మార్కెట్లు, వైన్ షాప్స్ వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లో నిత్యావసరాల కోసం ఉదయం నుంచే రోడ్లపైకి ప్రజలు వచ్చారు. మరోవైపు వాక్సినేషన్ కార్యక్రమం మాత్రం ఆగేది లేదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా కోసం వెళ్ళే వారికి అత్యవసర సర్వీసులకు మాత్రం అనుమతి ఉంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/