దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు లాక్ డౌన్

31 వరకు నిబంధనలు అమలు

19 states nationwide lockdown

New Delhi: కరోనా వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

అలాగే దేశంలోని అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలూ లాక్ డౌన్ ప్రకటించాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు మినహాయించి. అన్నీ సర్వీసులు బంద్ కానున్నాయి.

ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పళణి స్వామి వెల్లడించారు. కాగా  దేశీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నెల 31 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/