మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

జాతినుద్దేశించి ప్రసంగంలో ప్రధాని వెల్లడి

narendra modi
narendra modi

దిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్ధేశించి .. దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మే నెల 3వ తేది వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని భారత ప్రజలమైన మేము అన్న పదానికి ప్రజలందరూ సంపూర్ణ నిదర్శనంగా నిలుస్తున్నారని తెలిపారు. భారత్‌ అంటేనే భిన్న సంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని అన్నారు.

నేడు అంబేద్కర్‌ జయంతి సందర్బంగా ఆయన సేవలను గుర్తు చేశారు. దేశంలో ప్రజలంతా ఐక్యతగా ఉండి కరోనా మహామ్మారి నుండి దేశాన్ని కాపాడుకోవడమే అంబేడ్కర్‌కు గొప్ప నివాళి అని మోదీ అన్నారు. దేశంలో వివిధ పండుగలు కూడా ఈ ప్రమాదం కారణంగా సాదాసీదాగా జరుపుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

దేశంలో కోవిడ్‌-19 కేసులు 100 నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్‌, క్వారంటైన్‌ చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే 550 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగానే దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ విధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కోంటున్న పరిస్థితులను బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదే అని. ఈ రోజు ప్రపంచదేశాలు భారత్‌వైపు చూస్తున్నాయన్నారు.

ఈ మహామ్మారి ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతుంది. ఈ సమయంలొ ప్రజల కష్టాల్ని ఎలా తగ్గించాలి… దీని తీవ్రతను కనిష్టానికి ఎలా పరిమితం చేయాలని అన్ని రాష్ట్రాలతో నిరంతరం చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ప్రరిశ్రమల్లో పని చేసే వారిని ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దని ఆయన కోరారు.

దేశంలోని రైతులు, కూలీలు, పేదలను దృష్టిలో పెట్టుకున్నామని ప్రధాని తెలిపారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరు మే 3 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు భాధ్యతగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/