ఏకాభిప్రాయంతోనే లాక్‌డౌన్‌ పొడిగింపు

యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపుతాం

G. Kishan Reddy
G. Kishan Reddy

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… పలు రాష్ట్రాలతో చర్చించి, ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ ను పొడిగించామని చెప్పారు. రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కరోనాపై పోరాడుతుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన వలస కార్మికులను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. రైల్వే స్టేషన్లలో రైల్వే టిక్కెట్లు అమ్మబోరని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఎవ్వరూ రైల్వే స్టేషన్ల వద్దకు రావద్దని ఆయన సూచించారు. విద్యార్థులు, యాత్రికులు, కూలీలు వంటి వారికి ప్రత్యేకంగా అధికారులు ప్రయాణం చేసే అవకాశాలు కల్పిస్తున్నారని కిషన్‌ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా సంబంధిత కూలీలు పనిచేస్తోన్న సంస్థలు రైల్వే టిక్కెట్లు ముందుగానే కొనాల్సి ఉంటుందని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/