రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిర్ణయం వారిదే

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

Union Home Minister Kishan Reddy
Union Home Minister Kishan Reddy
  • ప్రపంచం వ్యాప్తంగా చూస్తే భారత్ లోనే కరోనా కేసులు అధికం
  • ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో పరిధిలో చేర్చారు
  • ఎయిమ్స్‌లో ప్రస్తుతం 25 ఆక్సిజన్ పడకలు
  • 15 రోజుల్లో 200 పడకలు ఏర్పాటు చేస్తాం

Hyderabad: ప్రపంచం వ్యాప్తంగా చూస్తే భారత్ లోనే కరోనా కేసులు అధికంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్‌ లోని ఎయిమ్స్‌‌ ను అయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఏర్పాటు నిర్వహణ , బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో పరిధిలో చేర్చారని తెలిపారు. తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 25 ఆక్సిజన్ పడకలతో చికిత్స విభాగం ఏర్పాటు చేసినట్లు , రానున్న 15 రోజుల్లో 200 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి పూర్తిగా జరుగుతుందని తెలిపారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/