మే 3 తరువాత లాక్‌డౌన్‌ కొనసాగింపు

గ్రీన్‌జోన్లు, వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో కొన్ని ఆంక్షలు సడలింపు

CM Conrad Sangma
CM Conrad Sangma

షిల్లాంగ్‌: కరోనా నియంత్రణకు చర్యల్లో భాగంగా మే 3 అనంతరం కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సింగ్మా అన్నారు. ఈరోజు ప్రధాని మోడి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తర్వాత సింగ్మా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తమ రాష్ట్రంలోని గ్రీన్‌జోన్లు, వైరస్ ప్రభావం లేని జిల్లాల్లో కొన్ని ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. ‘ప్రధాని, హోం మంత్రి అమిత్‌ షా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా. మేఘాలయాలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని మేం భావిస్తున్నట్టు వారికి చెప్పాం’ అని సంగ్మా ట్వీట్ చేశారు. మేఘాలయాలో ఇప్పటిదాకా 12 మందికి కరోనా సోకగా అందులో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో రెండు జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/