అమరావతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవు

Amaravati in AP
Amaravati in AP

అమరావతి: ఏపిలో స్థానిక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే రాజధాని గ్రామాలను ప్రత్యేక కార్పోరేషన్‌ పరిధిలోకి తీసుకు వచ్చే యోచనలో ఉంది ఏపి ప్రభుత్వం. దీంతో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు లేవనే తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిగ్రామాలను ఇతర మున్సిపాలిటీల్లో విలీనం చేస్తుండడం మరో కారణం. తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా, మంగళగిరి పురపాలికల్లో బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను కలపాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలను కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఆయా గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/