కొత్త మండలాలకు రిజర్వేషన్లు ఖరారు

government of telangana
government of telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు మండలాలకు జడ్పీటిసి, ఎంపిపి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో మోస్రా, చండూరు మండలాలతో పాటు సిద్దిపేటలోని నారాయణపేట, మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి మండలాల రిజర్వేషన్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు నేడో రేపో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ జరిగే అవకాశముంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/