రేపే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలిపోరు

ZPTC, MPTC Election nominations
ZPTC, MPTC Election nominations

హైదరాబాద్‌: రేపు పరిషత్ ఎన్నికల్లో భాగంగా197 మండలాల్లో తొలివిడుత పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయాస్థానాల్లో నిన్న సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగిసింది. తొలివిడుతలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడుతలో సమస్యాత్మకంగా గుర్తించిన 217 ఎంపీటీసీ స్థానాల్ల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలి విడుతకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ కేంద్రాలవారీగా సిబ్బందిని నియమించింది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/