హౌస్ లో అర్ధరాత్రి లోబో చేసిన పనికి హౌస్‌మేట్స్‌ అంత లేచి కూర్చున్నారు

బిగ్ బాస్ సీజన్ 05 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. మొదటి రోజే హౌస్ లోకి వెళ్లిన సభ్యులకు టాస్క్ లు ఇచ్చి వారికీ చెమటలు పట్టించాడు. మొత్తం 19 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రేపు హౌస్ లో ఏంజరగబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నింపారు. తాజాగా కొత్త ప్రోమో విడుదల చేసారు స్టార్ మా.

కొత్త ప్లేస్ కు వెళ్తే కొంతమందికి మొదటి రోజు నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. అలాంటిది రాత్రిపూట ఎవరైనా గురక పెడితే ఇంకేమైనా ఉందా? బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లకు కూడా ఇదే ఎదురైంది. యాంకర్‌ లోబో అర్ధరాత్రి పెద్ద పెద్దగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతడి గురక సౌండ్‌కు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు హౌస్‌మేట్స్‌. యాంకర్‌ రవి అయితే అతడికి దుప్పటి కప్పి, బయటకు పెద్దగా సౌండ్‌ వినిపించకుండా రెండు దిండ్లను కూడా లోబో ముఖం మీద పెట్టి ఉంచాడు. అయినా సరే లోబో గురకను ఆపడం ఎవరి తరమూ కాలేదు. దీంతో రాత్రంతా వారికి జాగారమే అన్నట్లు ప్రోమో లో కనిపించింది. అలాగే హౌస్ లోకి వెళ్లిన సభ్యులకు ఎలిమినేషన్‌ కోసం నామినేషన్‌ మొదలుపెట్టారు.

YouTube video

YouTube video