పేదల ఇంటి రుణాలు మాఫీ : జగన్‌

jagan
Jagan

శ్రీకాకుళం: శనివారం పాదయాత్రలో భగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పేదల ఇంటి రుణాలు మాఫీ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని చుట్టూ భూముల్ని చంద్రబాబు బినామీలే కొన్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. వంశధార ప్రాజెక్ట్‌కు వైఎస్‌ రూ. 700 కోట్లు మంజూరు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీఎం రమేష్‌ కంపెనీకి వంశధార పనులు కట్టబెట్టారని జగన్‌ విమర్శించారు.