బాబ్రీ మసీదు తీర్పును స్వాగతిస్తున్నా..అద్వానీ

తమ నిబద్దతను తీర్పు ప్రతిబింబిస్తోందన్న అద్వానీ

lk-advani

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అద్వానీ స్పందిస్తూ.. కోర్టు తీర్పును మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించి బిజెపితో, తన వ్యక్తిగత నమ్మకాలను, నిబద్దతను కోర్టు తీర్పు ప్రతిబింబిస్తోందని అన్నారు. కాగా ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బిజెపి నాయ‌కులు వెళ్లారు. ఇక ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.


తాజా ఏపి వార్త కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/