రెండు రోజులు మద్యం విక్రయాలు బంద్‌

bar shop
bar shop


హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో ఓటర్లను మద్యంతో మభ్యపెట్టే ప్రయత్నాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈసి ఆదేశాల మేరకు ఆబ్కారీ నిఘా పెంచింది. మద్యం విక్రయాలకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని, ఏరోజు కారోజు మద్యం విక్రయాల వివరాలను సమర్పించాల్సిందిగా ఈసి ఆబ్కారీశాఖను ఆదేశించిన నేపథ్యంలో మద్యం లెక్కలపై ఆబ్కారీ అధికారులు పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 6 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు వైన్‌షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, అన్ని రకాల స్టార్‌ హోటళ్లుకు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆబ్కారీ, పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బెల్లుషాపుల్లో మద్యం విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని, హెచ్చరించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/