తెలంగాణలో దసరా కు ముందే మద్యం అమ్మకాల జోరు అందుకున్నాయి

తెలంగాణ లో దసరా సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యముగా మద్యం ప్రియులు జోరు గా మద్యాన్ని సేవిస్తున్నారు. రోజు అమ్మకాల కంటే డబల్ గా మద్యం విక్రయం జరుగుతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. మాములు రోజుల్లో నిత్యం రూ.60-90 కోట్ల విలువైన విక్రయాలు జరిగితే..గత మూడు రోజులుగా విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెపుతున్నాయి.

తెలంగాణ లో పెద్ద పండగ అంటే దసరానే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా దసరా పండగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ఇంకా ఎక్కడ ఉన్నాసరే..దసరా కు తమ సొంత ఉరికి వచ్చి , కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. డబ్బును ఏమాత్రం లెక్క చేయకుండా ఖర్చు చేసి సంతోషంగా గడుపుతారు. ఇక తెలంగాణ లో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ముములు రోజుల్లోనే భారీగా మద్యం విక్రయాలు జరుగుతాయి. అలాంటిది పెద్ద పండగ దసరా అంటే ఇంకా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రస్తుతం దసరా కు ఇంకా నాల్గు రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుండే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం డిపోల నుంచి దుకాణాలకు రోజుకు రూ.100 కోట్లకుపైగా మద్యం తరలుతోంది. ఈ నెల 26న రూ.174.55 కోట్లు, 27న రూ.123.93 కోట్లు, 28న రూ.117.02 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి.

గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలానికి రూ.3,300 కోట్లకు పైగా ఎక్కువ విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి బుధవారం నాటికి రూ.25,223.58 కోట్ల మద్యం అమ్ముడుపోయింది.దసరాకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండటంతో రూ.26 వేల కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇంకా మూడు నెలలు మిగిలి ఉండటం.. డిసెంబరు 31 వేడుకల్లో మద్యం ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం లాంటి కారణాలతో విక్రయాల విలువ రూ.35 వేల కోట్లు దాటుతుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.