రెడ్ జోన్లలోనూ మద్యం అమ్మకాలకు లైన్ క్లియర్!

షరతులతో గ్రీన్ సిగ్నల్

Liquor

New Delhi: దేశంలోని రెడ్ జోన్లలోనూ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం కొన్ని షరతులు విధించింది.   దేశంలోని అన్ని రకాల జోన్లలోనూ మద్యం అమ్మకాలు జరిపేందుకు కొన్ని షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రాష్ట్రాలదే తుది నిర్ణయం.

మద్యం అమ్మకాలకు షరతులు :

– రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకుంటే… మే 4 నుంచి ఆ రాష్ట్రాల్లో లిక్కర్, పాన్, పొగాకు షాపులు తెరచుకుంటాయి.
– దేశంలో మూడు జోన్లు ఉన్నాయి. రెడ్ (ఎక్కువ కరోనా కేసులు ఉన్నవి), ఆరెంజ్ (తక్కువ కేసులు ఉన్నవి), గ్రీన్ (గత 21 రోజుల్లో ఒక్క కేసూ లేనివి)

– జోన్ ఏది అన్నదాన్ని బట్టీ… ఆ జిల్లాలో మద్యం, పాన్ ఎలా అమ్మాలన్నది నిర్ణయిస్తారు.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి  జిల్లాలు రెడ్ జోన్లుగా ఉన్నాయి.   రాష్ట్ర ప్రభుత్వం ఒకే అంటే ఇక్కడ లిక్కర్ షాపులు తెరచుకోవచ్చు. 

తెలంగాణలో సంపూర్ణ లాక్‌డౌన్  మే 7 వరకూ ఉంటుంది కనుక అప్పటివరకూ ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశం లేదు. మే 7 తర్వాత ఏం చెయ్యాలో, వేటికి అనుమతి ఇవ్వాలో మే 5న కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  ఏపీ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోవడంతో… మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తుండటంతో మే 4 నుంచే ఏపీెలోమద్యం షాపులు తెలుసుకునే అవకాశం ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/