హుజురాబాద్ లో కేవలం రెండు రోజుల్లో రెండు కోట్ల మద్యం అమ్మకాలు

మాములుగా మద్యం అమ్మకాలు భారీ స్థాయి లో జరిగాయంటే అది నూతన సంవత్సర వేడుకల్లో అని మనకు తెలుసు. కానీ హుజురాబాద్ లో మాత్రం రెండు రోజుల్లో రెండు కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయట. దీనికి కారణం ఉప ఎన్నిక పోలింగ్ ఎఫెక్ట్ అని చెప్పాల్సిన పనిలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు డబ్బును ఏమాత్రం లెక్క చేయలేదు. మొదటి నుండి భారీ ఎత్తున ఖర్చు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో మునిగారు.

హుజురాబాద్ నియోజవర్గం లో గురు శుక్రవారం ఈ రెండు రోజు ల్లో రెండు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయని చెబుతున్నారు. సెప్టెంబర్ అక్టోబర్ నెల ల్లో హుజురాబాద్ లో 48 కోట్ల 2 లక్షల 28 వేల రూపాయల మద్యం అమ్మినట్లు రికార్డులు చెబుతున్నాయి. హుజరాబాద్ లో ఓటర్ల ను ప్రలోబాలకు గురి చేసేందుకు డబ్బుతో పాటు మద్యాన్ని విచ్చల విడి గా పంపిణీ చేశారు. రెండు నెలలు గా హుజురాబాద్ లో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు గా ప్రచారం చేశారు. పోటా పోటీ ప్రచారం తో పాటు మద్యం మాంసం విందులకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.