ఢిల్లీలో మ‌ద్యం సంక్షోభం

దేశ రాజధాని ఢిల్లీలో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు.. న‌వంబ‌ర్ నుండి నూత‌న ఎక్సైజ్ పాల‌సీ అమ‌లు కానున్న నేపథ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం ..కేవ‌లం ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని వైన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దీంతో వాటిల్లో కేవ‌లం కొన్ని లిక్క‌ర్ బ్రాండ్లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. తమకు కావాల్సిన బ్రాండ్లు లేకపోయేసరికి మందు బాబులు నానా కష్టాలు పడుతున్నారు. ఢిల్లీలో మొత్తం 32 జోన్ల‌లో 27 మంది మ‌ద్యం వ్యాపారుల‌కు లైసెన్స్‌లు ఇచ్చారు.

ఒక్కో జోన్‌లో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దీంతో మొత్తం 260 వైన్ షాపుల్లో ప్రైవేటు వారు మ‌ద్యాన్ని విక్ర‌యించ‌నున్నారు. కానీ ఎక్సైజ్ పాల‌సీకి గ‌డువు ముగియ‌డంతో ప్రైవేటు లిక్క‌ర్ షాపుల‌ను మూసేయించారు. కొత్త‌గా లైసెన్స్‌లు పొందిన వారు న‌వంబ‌ర్ 17 నుంచి మ‌ద్యం విక్ర‌యించాల్సి ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు షాపుల‌ను మూసేయాలి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న వైన్ షాపుల‌ను మాత్ర‌మే తెరిచి ఉంచారు. అక్కడ కావాల్సిన మందు దొరకకపోయేసరికి వాటికోసం నగరం అంత గాలిస్తున్నారు.