రాజశేఖర్ కారులో మద్యం సీసాలు

Car Accident
Car Accident

Ragareddy: హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు మంగళవారం రాత్రి అప్పా జంక్షన్ దగ్గర అర్థరాత్రి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదాంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. సకాలంలో కారులోని బెలూన్ లు తెరుచుకోవడంతో రాజశేఖర్ కు ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకోగలిగారు..కాగా, కారు ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాఫ్తు చేపట్టారు. కారుని సీజ్ చేశారు. అందులో తనిఖీలు చేయగా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఇక ప్రమాదం సమయంలో కారు వేగం 150 కిమీ ఉంది. మద్యం బాటిళ్లు లభించడం, ఓవర్ స్పీడ్ ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. మద్యం మత్తులోనే కారు ప్రమాదం జరిగిందా లేక అతివేగం కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/