లిప్‌స్టిక్‌ మరింత అందంగా

అందమే ఆనందం

Lipstick
Lipstick

అందమైన పెదవులకు లిప్‌స్టిక్‌ మరింత అందాన్ని ఇస్తుంది. అయితే లిప్‌స్టిక్‌లో రకరకాలుంటాయి. వేసుకునే విధానంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

రంగుల్లో కూడా విభిన్నమైనవి ఉంటాయి. అయితే ఎవరికి ఏ రంగు సూటవుతుందో. ఎలాంటి పెదవులకు ఏ లిప్‌ కలర్‌ ఎంచుకోవాలో వంటివి జాగ్రత్తగా ఎన్నుకుంటే మంచిది. వేసుకునే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం.

అప్పుడే పెదవ్ఞలకు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. న్యూడ్‌ లిప్‌ కలర్‌ అనేది లిప్‌స్టిక్‌ షేడ్స్‌లో ప్రత్యేకమైనది.

స్మోకీ ఐస్‌ లేదా డ్యూ మేకప్‌తో సహా ఏ లుక్‌ మీదకు అయినా సరే న్యూడ్‌ లిప్‌స్టిక్‌ చక్కగా మ్యాచ్‌ అవుతుంది.

మీరు కూడా న్యూడ్‌ లిప్‌ కలర్‌ ట్రెండ్‌ను ఫాలో అవాలనుకుంటున్నారా. ముందుగా పెదవులను శుభ్రం చేసుకోవాలి.దాంతో వాటి మీది మృతకణాలు తొలగి మృదువుగా మారతాయి.

తరువాత లిప్‌ ఆయిల్‌ లేదా లిప్‌బామ్‌ రాసుకోవాలి. చర్మం రంగుకు సరిపోయే లిప్‌కలర్‌ ఎంచుకోవాలి. అంతేకాదు ఆ కలర్‌ పెదవుల రంగుకు సరిపోతుందా లేదా! చెక్‌ చేసుకోవాలి.

అయితే ముదురు రంగు లిప్‌స్టిక్‌ రాసుకుంటే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. న్యూడ్‌ లిప్‌ కలర్‌ ఒక్కటే వాడితే పెదవులు పాలిపోయినట్లుగా ఉంటాయి. అప్పుడు నేచురల్‌ కలర్‌ బ్రష్‌ వాడితే పెదవులు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

సీసీ క్రీమ్‌ లేదా షీర్‌ ఫౌండేషన్‌ అప్లై చేసుకున్నా సరిపోతుంది. లిప్‌స్టిక్‌ వేసుకోవడం అయ్యాక లైన్‌ గీసుకోవడం మరువవద్దు.

లిప్‌లైన్‌ చక్కని ఆకృతిలో వచ్చేందుకు కావాలంటే కన్‌సీలర్‌ ఉపయోగించవచ్చు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/