ఆరోసారి బాలన్‌ డి ఓర్‌ను గెలిచిన లియోనెల్‌ మెస్సీ

Lionel Messi
Lionel Messi

పారిస్‌: అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ బాలన్‌ డి ఓర్‌ అవార్డును గెలుచుకున్నారు. మెస్సీ రికార్డు స్థాయిలో ఈ అవార్డును ఆరోసారి తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటతీరును కనబర్చే వారికి ఈ బాలన్‌ డి ఓర్‌ అవార్డును ప్రధానం చేస్తారు. అయితే మెస్సీ చివరగా 2015లో బాలన్‌ డి ఓర్‌ అవార్డును గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం లియోనెల్‌ మెస్సీ మాట్లాడుతూ.. తను మొదటి బాలన్‌ డి ఓర్‌ను గెలిచి 10 సంవత్సరాలయిందని తెలిపారు. ఆ సమయంలో తన ముగ్గురు సోదరులతో కలిసి వచ్చానని, ఆ సందర్భం ఇంకా తనకు గుర్తు ఉందని మెస్సీ చెప్పారు. ఇది తన ఆరవ టైటిల్‌ అని, ఇన్ని టైటిల్‌లు సాధిస్తానని అస్సలు ఊహించనేలేదని అన్నారు. తనకు ఈ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందని మెస్సీ తెలిపారు. తన భార్య పిల్లలతో వ్యక్తిగత జీవితం ప్రత్యేకమైందని కూడా మెస్సీ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/