లింక్డ్‌ఇన్‌ సీఈవో జెఫ్‌ వీనర్‌ రాజీనామా

Jeff Weiner
Jeff Weiner

న్యూయార్క్‌: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్‌ఇన్ సీఈవో జెఫ్ వీనర్(49) తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా 11 సంవత్సరాల పాటు సంస్థకు సేవలందించిన వీనర్‌ తాజాగా ఈ పదవి నుంచి తప్పుకున్నారు. జెఫ్ వీనర్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారనీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రోస్లాన్‌ స్కీ జూన్ 1వ తేదీనుంచి సీఈవోగా బాధ్యలను స్వీకరించనున్నారని మైక్రోసాఫ్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లింక్డ్‌ఇన్‌లో 10 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ర్యాన్‌ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేస్తారని వెల్లడించింది.న రాజీనామాపై స్పందించిన వీనర్‌ గత పదకొండు సంవత్సరాలు తన జీవితంలో గొప్ప వృత్తిపరమైన అనుభవాన్నందించాయని పేర్కొన్నారు. ఇందుకు లింక్డ్‌ఇన్‌ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/