గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు బందోబస్తు

Gandhi Hospital
Gandhi Hospital

హైదరాబాద్‌: జులై 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా గుండాల మండలంలో మృతి చెందిదన లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు లింగన్న మృతదేహాన్ని తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాగా లింగన్న మృతదేహానికి ముగ్గురు వైద్యుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించనుంది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులు ఏర్పాట్లు చేశారు. రీపోస్టు మార్టం నివేదికను ఈనెల 5న హైకోర్టుకు సమర్పిస్తారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. రీ పోస్టుమార్టం నేపథ్యంలో ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన చేస్తున్న ఆందోళకారులను అరెస్టు చేశారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/