రాహుల్‌ గాంధీపై శివసేన ఫైర్‌

Sanjay Raut
Sanjay Raut

ముంబయి: భారత్‌ బచావో ర్యాలీ కామెంట్స్‌పై పెద్ద దుమారమే రేపుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సావర్కర్ వ్యాఖ్యల సెగ మహా సంకీర్ణానికి తగిలింది. రాహుల్‌పై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సావర్కర్ విషయంలో తాము రాజీపడేదే లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. సంజయ్ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూల్లాగే సావర్కర్ కూడా మహానేత అని పొగిడారు. స్వాతంత్రోద్యమంలోని మహానీయులను అందరూ గౌరవించాల్సిందేనని సూచించారు. పేరులో గాంధీ ఉన్నంతమాత్రాన రాహుల్ గాంధీ కాలేరని మండిపడ్డారు. రాహుల్ ఎన్ని జన్మలెత్తినా సావర్కర్ కాలేరని ఆర్‌ఎస్‌ఎస్ దుమ్మెత్తిపోసింది. భారత్ బచావో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రేప్ ఇన్ ఇండియాపై క్షమాపణలు చెప్పడానికి తాను రాహుల్ సావర్కర్ కానని రాహుల్ గాంధీని అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/