మంచిర్యాల‌లో బైక్ ఫై పిడుగు పడి ముగ్గురు మృతి

మంచిర్యాల‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం బైక్ ఫై వెళ్తున్న వారిపై పిడుగు పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తో ఆ కుటుంబంలో విషాదం నెలకొని ఉంది. పిడుగు ప‌డిన వెంట‌నే త‌ల్లితో పాటు కొడుకు మృతి చెందాడు. బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా చికిత్స పొందుతూ అత‌డు కూడా కొన్ని గంట‌ల్లోనే మృతి చెందాడు. ఇక మృతులు వెంక‌టేష్ మ‌రియు అత‌ని భార్య మౌనిక తో పాటు వారి కుమారుడిగా గుర్తించారు. మంచిర్యాల‌లో ఉదయం నుండి ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తోంది. కాగా రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా పిడుగు ప‌డ‌టంతో స్థానికులు అంత భయాందోళనకు గురైయ్యారు.

తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణితో పాటు.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిన్నటి నుండి వానలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.