లైగర్ ట్రైలర్ వచ్చేసింది..

యావత్ విజయదేవరకొండ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న లైగర్ ట్రైలర్ వచ్చేసింది. పూర్తి యాక్షన్ తో ట్రైలర్ నింపేసాడు పూరి. అలాగే పూరి మార్క్ డైలాగ్స్ , హీరోయిన్ తో హీరో రొమాన్స్ వంటివి పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇప్పుడు ట్రైలర్ కూడా మరింతగా ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.