లైగర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన

యావత్ విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్న అసలైన అప్డేట్ వచ్చేసింది. లైగర్ ట్రైలర్ ను జులై 21 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ , సాంగ్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా జులై 21 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లను వుండగా విజయ్ మధ్యలో ఉన్నాడు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో ఐదు రోజులు ఆగాల్సిందే.