గోవాలో మొదలైన లైగర్

విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ని ఛార్మి, కరణ్ జోహార్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది.

కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆగిపోగా..ఈరోజు నుండి గోవా లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. కరోనా ఉదృతి లేకపోతే ఈరోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. కానీ కరోనా పెరగడం , థియేటర్స్ మూతపడడం , షూటింగ్స్ నిలిచిపోవడంతో సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నారు. ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించబోతాడని వినికిడి. ఇక ఈ మూవీ తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.