లైగర్ సండే కలెక్షన్స్..మరీ దారుణం

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం సండే దారుణమైన కలెక్షన్లు రాబట్టింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేసారు. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో లైగర్ విఫలమైంది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో మొదటిరోజు మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లు పడిపోయాయి. ఇక నిన్న ఆదివారం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అతి తక్కువ కలెక్షన్లను రాబట్టింది.

నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 55 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఫలితంగా నాల్గు రోజుల్లో నైజాంలో రూ. 5.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.70 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 53 లక్షలతో.. రూ. 12.66 కోట్లు షేర్, రూ. 21.45 కోట్లు గ్రాస్ వసూలు సాధించింది. వరల్డ్ వైడ్ గా చూస్తే..రూ. 24.41 కోట్లు వచ్చాయి..ఇంకా రూ. 65.59 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ జాబితాలో చేరుతుంది.