సోనీ చేతికి లైగర్ ఆడియో రైట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరీ జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఛార్మి, క‌ర‌ణ్ జోహార్‌, అజ‌య్ మెహ‌తాల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ‘సోనీ మ్యూజిక్’ 14 కోట్లకు సొంతం చేసుకుంది అని సమాచారం.

త‌నిష్క్ భ‌గ్చీ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఆయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో లైగ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ రిలీజ్‌కి సిద్ధమవుతుండగానే విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ JGMను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.